ఎంపీ శశి థరూర్ – మహిళా జర్నలిస్ట్ ఫొటోలు వైరల్
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఒక మహిళా జర్నలిస్టుతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ చిత్రాల్లో జర్నలిస్టు థరూర్ భుజంపై చేయి వేసి ఉన్న విధంగా కనిపించడంతో నెట్టింట చర్చలు వేడెక్కుతున్నాయి.
వైరల్ అవుతున్న మహిళా జర్నలిస్టు రంజున్ శర్మ. ఆమె రష్యాలోని మాస్కోలో RT ఇండియా న్యూస్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు శశి థరూర్ గానీ, రంజున్ శర్మ గానీ ఈ ఫోటోలపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

