Andhra PradeshNews

రఘురామకు అందిన సిట్ నోటీసులు

ఫామ్ హౌస్  విచారణ సందర్భంగా  ఎంపీ రఘురామకు సంబంధించిన పలు కీలక విషయాలను సిట్ సేకరించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో తెలంగాణ సిట్ నోటీసులు అందుకున్నానన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఢిల్లీలోని తన నివాసానికి సిట్ నోటీసులు అందాయన్నారు. కేసుకు సంబంధించి ఈ నెల 29న బంజారాహిల్స్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు ఎంపీ రఘురామ తెలిపారు. ఈ క్రమంలో ఆయనకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్‌లు ఇప్పటికే నిందితులుగా ఉండగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ వైద్యుడు డాక్టర్ జగ్గుస్వామి, బీడీజేఎస్ నేత తుషార్, కరీంనగర్ న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌లను సిట్ నిందితుల జాబితాలో చేర్చింది.