కూతురు ఆత్మహత్యకు కారణమైన తల్లి ఆగ్రహం
తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన కొడ అంకిత (15) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో మొబైల్ ఫోన్లో వీడియోలు చూస్తూ ఉండడంతో తల్లి మందలించడంతో అంకిత మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గుర్తించి అపస్మారక స్థితిలో ఉన్న అంకితను ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు.

