Home Page SliderTelangana

ఈ జిల్లాలో గుంపులుగా కోతుల దాడులు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని గ్రామాలలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. కోతులు ఈ గ్రామాలలో గుంపులు గుంపులగా దాడులు చేస్తున్నాయి. దగ్గరలోని అటవీ ప్రాంతాలు కొట్టివేయడంతో వాటికి ఆవాసాలు లేక ఆ కోపాన్ని మనుష్యులపై చూపిస్తున్నాయి. అక్కడి గ్రామాలలోని ప్రజలు వీటితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుండి ఒంటరిగా బయటకొస్తే చాలు మంకీమూక దాడులు చేసేస్తున్నాయి. చేతిలో ఉన్న సరుకులు లాక్కుని వెక్కిరిస్తున్నాయి. ఇళ్లలోకి కూడా చొరబడి సామాన్లు చోరీ చేస్తున్నాయి. దుకాణాదారులు కూడా వీటి దాడికి భయపడి దుకాణాలకు గ్రిల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. షాపులకు వచ్చిన వినియోగదారులు కూడా సామాన్లు భద్రంగా తీసుకెళ్లలేకపోతున్నారని చెప్తున్నారు. వీటికోసం ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు. కోతుల కోసం బడ్జెట్‌లో ఒక్కో కోతికి రూ.600 చొప్పున కేటాయించింది మున్సిపాలిటీ. అయినప్పటికీ ఈ జిల్లాలో మనుష్యుల కంటే కోతుల సంఖ్యే ఎక్కువగా ఉంది. కోతి కాటుకి గురవుతున్న వారు కూడా పెరుగుతున్నారు. వృద్ధులు, పిల్లలు ఒంటరిగా వెళ్లాలంటే భయపడుతున్నారు. వీటికి పరిష్కారం చూపాలని గ్రామస్తులు అభ్యర్థిస్తున్నారు.