Home Page Sliderhome page sliderNationalNewsNews Alertviral

ఆ విషయంలో మోడీ తల వంచుతారు: రాహుల్ గాంధీ

అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలకు ప్రధాని మోదీ తలొగ్గుతారని, ఈ విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకోవడం తప్ప ఏమీ చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. తన మాటలను రాసిపెట్టుకోవాలంటూ సవాల్ విసిరారు.మూడు నెలల క్రితం భారత్‌పై అమెరికా 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సుంకాల సస్పెన్షన్ గడువు జులై 9తో ముగియనుండటంతో ఆలోగా ఓ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.