home page sliderHome Page SliderNational

రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు, కాల్పుల విరమణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ లో భారత సైన్యం విజయం సాధించినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. తీవ్ర సస్పెన్స్ క్రియేట్ చేసిన ఈ ఆపరేషన్ తర్వాత ప్రధాని తొలిసారి మీడియా ముందుకు రాబోతున్నారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుంచి త్రివిధ దళాధిపతులు, ఎన్ఎస్ఏ, సీడీఎస్ తో మోడీ వరుసగా సమీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు ఆపరేషన్ సిందూర్ వివరాలు తెలుసుకుంటూ అనుసరించాల్సిన వ్యూహాలను భద్రతా దళాలకు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పటి వరకు ఈ ఆపరేషన్ పై పబ్లిక్ గా మాట్లాడని మోడీ ఇవాళ మీడియా ముందుకు రాబోతున్నారు. దీంతో ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది.