NewsTelangana

ఉచిత విద్యుత్‌ ఇవ్వవద్దని మోదీ ఎక్కడా చెప్పలేదు

వికారాబాద్‌కు జీజేపీ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న కేసీఆర్‌ ముందు తానేం చేశాడో చెప్పాలని కొండా విశ్వేశ్వర రెడ్డి మండిపడ్డారు. సర్పంచ్‌ల నిధులు, విధులను సీఎం హరిస్తున్నారని, అందుకే మునుగోడు నియోజకవర్గ సర్పంచ్‌లు బీజేపీలో చేరేందుకు క్యూ కట్టారని కొండా అన్నారు. ప్రధాని మోడీ రైతు రుమాలు కట్టుకుంటే కేసీఆర్‌ వెక్కిరించడాన్ని కొండా విశ్వేశ్వరరెడ్డి తప్పుబట్టారు. ఉచిత విద్యుత్‌ ఇవ్వవద్దని ప్రధాని ఎక్కడా చెప్పలేదని, ఇచ్చేది సక్రమంగా ఇవ్వాలని మాత్రమే కోరారని చెప్పారు.