Andhra PradeshHome Page Slider

రోడ్డు ప్రమాదంలో MLC దుర్మరణం

పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పొందారు. కాగా ఇవాళ ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న కారును మరో కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ గన్‌మెన్ తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఉండి మండలం చెరుకువాడలో చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ఎమ్మేల్సీ భీమవరం నుంచి ఏలూరు వెళ్తున్నట్లు తెలుస్తోంది. షేక్ సాబ్జీ ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు.కాగా ఎమ్మేల్సీ షేక్ సాబ్జీ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది.