నా భార్య బిడ్డలను వేధించారంటూ..ఎమ్మెల్యే కన్నీళ్లు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నాయకులపై సంచలన ఆరోపణలు చేశారు. కాగా ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలిచివేసింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో వైసీపీ మాజీ ఎంపీ అందాల ప్రభాకర్ రెడ్డి తన కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేశారని వాపోయారు. కాగా తన భార్య,బిడ్డలకు వీడియోలు పంపించారన్నారు. ఆ వీడియోలు చూసి తట్టుకోలేక వాళ్లు వాట్సప్ బ్లాక్ చేసుకున్నారని తెలిపారు. దీంతో తన కుటుంబం రాత్రింబగళ్లు ఏడ్చామని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీనీ వీడి టీడీపీలో చేరిన ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.

