home page sliderHome Page SliderTelangana

ఎమ్మెల్యే ఆన్ వీల్స్ యాప్ ప్రారంభం..

మానకొండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నూతన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని నుస్తులాపూర్‌లో ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే సులభతరమైన యాప్ ను ఆవిష్కరించడం జరిగింది. ప్రజల సమస్యలను ఈ యాప్ ద్వారా తెలియజేయడం వలన సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ఆన్ వీల్స్ వాహనం వారి ఊరికి వస్తుంది. వాహనంలో సంబంధిత అధికారులు వస్తారు. సత్వరమే సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సత్యనారాయణ ప్రజలను కోరుతున్నారు.