Home Page SliderTelangana

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి

భువనగిరి: రాష్ట్రాన్ని, ప్రజలను వంచించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సమాధి కట్టాలని భువనగిరి ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. వలిగొండ మండలం ఎం.తుర్కపల్లి తదితర గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చేది బీఆర్ఎస్ పార్టీ అని, మూడోసారి కేసీఆర్‌కు అధికారమిస్తే ప్రకటించిన హామీలన్నీ నెరవేరుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే దొంగల రాజ్యం వస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి తనకు ఓటువేసి గెలిపించాలని కోరారు.