మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ సియెన్నా వీర్ విషాదకరమైన ముగింపు
సియెన్నా వీర్, 2022 మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్, ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ మోడల్, 23 సంవత్సరాల వయస్సులో విషాదకరమైన గుర్రపు స్వారీ ప్రమాదంలో మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. మోడల్ స్వస్థలమైన ఆస్ట్రేలియాలో గత నెలలో గుర్రపు స్వారీ చేస్తూ ఘోర ప్రమాదానికి గురైంది. మిస్ వీర్ ఏప్రిల్ 2న ఆస్ట్రేలియాలోని విండ్సర్ పోలో గ్రౌండ్స్‌లో స్వారీ చేస్తుండగా, ఆమె గుర్రం పడిపోయింది. మే 4, గురువారం గాయాల కారణంగా ఆమెను లైఫ్ సపోర్ట్‌లో ఉంచారు. ఆరోగ్యం క్షీణించిపోవడంతో లైఫ్ సపోర్ట్‌ను తీసేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె మోడలింగ్ ఏజెన్సీ స్కూప్ మేనేజ్‌మెంట్ కూడా మరణాన్ని ధృవీకరించింది. ఆమె ఫోటోలను గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ”ఎప్పటికీ మన హృదయాల్లో” అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది.
ముఖ్యంగా, 2022 ఆస్ట్రేలియన్ మిస్ యూనివర్స్ పోటీలో 27 మంది ఫైనలిస్టులలో సియన్నా వీర్ ఒకరు. ఆమె సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యం, మనస్తత్వశాస్త్రంలో డబుల్ డిగ్రీ చేసింది. తన కెరీర్‌ను కొనసాగించడానికి యూకే వెళ్లాలని భావించింది. సోదరి, మేనకోడలు, మేనల్లుడితో ఎక్కువ సమయం గడపాలని, వృత్తిపరమైన, సోషల్ నెట్‌వర్క్ బేస్‌ను పెంచుకోవాలని ఇటీవల చెప్పింది. ఆస్ట్రేలియన్ ఫిట్‌నెస్ మోడల్‌కు గుర్రపు స్వారీ ఇష్టమైన వ్యాపకం. ఆమె గోల్డ్ కోస్ట్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ, జీవితంలో ఎక్కువ భాగం నగరంలోనే గడిపినప్పటికీ, గుర్రపుస్వారీ ఇష్టంగా ఆమె బతికేది. కుటుంబానికి ఈ అభిరుచి ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు, కానీ మూడేళ్ల వయస్సు నుండి గుర్రపు స్వారీ చేస్తున్నాను ఆమె చెప్పేవారు. ది లేకుండా జీవితాన్ని ఊహించలేనని చెప్పేది. వారాంతంలో న్యూ సౌత్ వేల్స్ లేదా, ఆస్ట్రేలియాలోని ఇతర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ పొందేదాన్ని చెప్పేది.

