విలీనంపై తప్పుడు వార్తలు.. విద్యాశాఖ క్లారీటీ..
ఏపీలో వైసీపీ సర్కార్ చేపట్టిన స్కూళ్ల విలీనాలు, మూసివేతలు వ్యవహరం అంతకంతకూ తీవ్రమవుతుంది. ఏపీలో తరగతుల విలీనంపై కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు చేస్తున్నారని AP ఎడ్యుకేషన్ ప్రిన్స్‌పల్ సెక్రటరీ రాజశేఖర్ మండిపడ్డారు. అయితే ఈ విషయం మీద బి.రాజశేఖర్ సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ “వియ్ ఆర్ నాట్ పర్‌ఫెక్ట్” ప్రభుత్వ స్థాయిలో తప్పులు జరుగుతుంటాయని, నేనేదో ఆర్డర్ ఇచ్చాను కాబట్టి చేసి తీరాలి అనట్లేదని’ రాజశేఖర్ వ్యాఖ్యానించారు. 3,4,5, తరగతుల విలీనంపై తప్పుడు వార్తలు రాస్తున్నారని, పత్రికలో కధనాలు రాసేవాళ్లు… సమస్య ఏంటో చెప్తే మేము పరిష్కరిస్తామన్నారు. మునుపెన్నడు చేయని ప్రక్రియను ఇప్పుడు చేస్తున్నామని తెలియజేశారు. విలీనంపై వివిధ వర్గాల వ్యతిరేకతకు రాజశేఖర్ సమాధానంగా గత మూడ్లేళ్లలోనే ప్రాధమిక విద్యారంగంలో అనేక మార్పులు తెచ్చామని… ఈ విద్యా విధానం బలంగా ఉంటే భవిష్యత్‌లో మంచి ఫలితాలుంటాయని ఆ ఉద్దేశంతోనే విలీన ప్రక్రియను ప్రారంభించామన్నారు. ఎంతో కసరత్తుతో ఈ ప్రక్రియను చేపట్టామని,కాని తల్లితండ్రులను తప్పుదోవ పట్టించ్చవద్దని మీడియాకు చెప్పారు. పిల్లలకు వారికి సరిపడా తరగతి గదులు, బెంచీలు ఉన్నాయా? తగినంత మంది సబ్జెక్ట్ టీచర్లు ఉన్నారా? అని పరీశిలించే నిర్ణయం తీసుకుంటున్నామన్నారు.
మెుదట 3.కి.మీ వరకు అనుకున్నా… కొంతమంది ఎమ్మెల్యేలు,మంత్రుల సూచనలతో ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతులను కి.మీ దూరంలోనే విలీనం చేశామన్నారు. రాష్ట్రంలో స్కూళ్లను మూసే ఉద్దేశం లేదని… విద్యాశాఖ మంత్రి కూడా ఇదే విషయం చెప్పినప్పటికి స్కూళ్లు మూసేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పిల్లలకు మంచి చేసే నిర్ణయాలే తీసుకుంటామన్నారు. ఈ ప్రక్రియను అర్ధం చేసుకోవటానికి విద్యార్ధులకు, తల్లితండ్రులకు కొంత సమయం పడుతుందని తెలిపారు.