చికోటితో చినజీయర్ స్వామికి సంబంధాలు- బక్క జడ్సన్
ఏదైనా ఒక వార్త సంచలనం అయితే చాలు, దానిచుట్టూ రకరకాల కథలు అల్లేస్తూ ఉంటారు కొందరు పుకార్ల రాయుళ్లు. చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో కొందరు రాజకీయనాయకుల పేర్లు బయటపడగానే, ఇక పార్టీలు ఒకదానిపై ఒకటి బురద జల్లుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈరోజు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈ క్యాసినో కింగ్‌కి, చినజీయర్ స్వామికి లింకులు పెట్టే ప్రయత్నాలు మెదలుపెట్టారు. చికోటి ప్రవీణ్‌తో చినజీయర్ స్వామికి సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. తనవద్ద ఆధారాలు ఉన్నాయని, ఈకేసులో జీయర్ స్వామిని విచారించాలని ఆయన ఈడీకి ఫిర్యాదు చేసారు. ఇతర దేశాల్లో జూదం ఆడడానికి ప్రవీణ్ చాలామందిని తీసుకెళ్లారని, చినజీయర్ ప్రవీణ్‌తో కలిసి కారులో ప్రయాణం చేసిన రుజువులు, వీడియోలు ఉన్నాయన్నారు. అవన్నీ ఈడీకి సమర్పించానని, చినజియార్ స్వామిని విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని జడ్సన్ అనుమానాలు వ్యక్తం చేసారు.