Home Page SliderTelangana

మహాలక్ష్మి పథకం అమలు విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష..

మహాలక్ష్మి పథకం అమలు విషయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల విషయంలో పావులు కదుపుతోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించిన ప్రభుత్వం ఇతర గ్యారెంటీలపై కసరత్తు చేస్తోంది. నేడు  సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు నీటి పారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. త్వరలో మహాలక్మి పథకం కింద 500 రూపాయలకు వంట గ్యాస్ సిలెండర్ ఇచ్చే అంశంపై చర్చించారు. రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ,రేషన్ లబ్దిదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా అంశాలు  చర్చకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావ్, సివిల్ సప్లయ్ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.