Home Page SliderTelangana

తెలంగాణా రైతు ఆత్మహత్యపై మంత్రి తుమ్మల ఆరా

ఈ రోజు చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బొజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నారు.తన పొలం కొందరు నాశనం చేశారంటూ వారిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని మనస్తాపంతో ఆయన సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య కు పాల్పడ్డారు. కాగా రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపి భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ పోలీస్ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ ఘటనపై విచారణ జరిపి తక్షణమే నివేదిక ప్రభుత్వానికి అందజేయాలని రెవెన్యూ పోలీస్ అధికారులకు ఆదేశించారు. తెలంగాణా రైతులు పొలం పంచాయితీల కోసం ఆత్మహత్య లకు పాల్పడవద్దని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.గ్రామాల్లో పొలం పంచాయితీల పై ప్రత్యేక దృష్టి పెడతామని తుమ్మల హామీ ఇచ్చారు.కాగా తెలంగాణాలో కాంగ్రెస్ పాలనలో రైతులకు న్యాయం జరుగుతుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.