అమెరికాలో మంత్రి లోకేష్
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏపీ మంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఏపీకి పెట్టుబడులు తేవడమే ముఖ్య ఉద్దేశంగా అమెరికాకు చేరుకున్నారు లోకేష్. ఈ నెల 29న లాస్‌వెగాస్‌లో ఐటీ సర్వీస్ సినర్జీ 9వ సదస్సుకు హాజరు కానున్నారు. అక్టోబర్ 31న అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. టీడీపీ యూఎస్‌ఏ సభ్యులు ఆయనకు స్వాగతం పలికి ఆహ్వానించారు.

