మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయం..
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయమైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్‌కు వైద్యులు సూచించారు.ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇవాళ కింద పడిపోయాను. దీంతో ఎడమ కాలి మడమకు యాంకిల్ ఫ్రాక్చర్ అయ్యింది . మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఈ సమయంలో విలువైన ఓటీటీ షోలు చూడటానికి సలహా ఇస్తారా? అంటూ కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.రేపు కేటీఆర్ బర్త్‌డే కాగా ఒక రోజు ముందు ఇలా జరగడంతో ఆయన అభిమానులు,టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు
Read more; కేసీఆర్‌కు డీకే అరుణ స్ట్రాంగ్ వార్నింగ్