NationalNews

గర్వంగా ఉంది-ముర్మి ఎంపికపై ఒడిశా సీఎం

Share with

రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మిని ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. ఒడిశా వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ చేయడం పట్ల ప్రజలంతా గర్వపడుతున్నారన్నారు. దేశ అత్యున్నత స్థానానికి ఎంపిక చేయడం నిజంగా గొప్ప విషయమన్నారు నవీన్ పట్నాయక్. ప్రధాని నరేంద్ర మోదీ ద్రౌపది ముర్మి విషయం తనతో చర్చించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఒడిశా ప్రజలందరికీ ఇది శుభదినమని పేర్కొన్నారు. దేశంలో మహిళల స్వావలంబనకు ద్రౌపది నిదర్శనంగా నిలుస్తారన్నారాయన. ఐదేళ్ల క్రితం ఒక దళితుడ్ని రాష్ట్రపతిని చేసిన బీజేపీ… నేడు ఆదివాసీల ముద్దుబిడ్డకు అత్యుతన్నత పదవికి నామినేట్ చేసింది. 64 ఏళ్ల ముర్ము జార్ఖండ్ గవర్నర్‌గా వివాదరహితంగా వ్యవహరించారు. వెనుకబడిన ఒడిశా నుంచి వచ్చిన ఆమె… ఆదివాసీ కావడంతోపాటు… మహిళ అభ్యర్థి కావడం విశేషం.