అక్కడే, అప్పుడే జగన్ ప్రమాణస్వీకారం: మంత్రి బొత్స
జూన్ 9న విశాఖలో జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేస్తారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అసలు టీడీపీకి ఓటేయడానికి ఉన్న కారణాలేవీ లేవన్నారు. విద్యా, వైద్యం విషయంలో జగన్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. సీఎం జగన్ చేసేదే చెప్తారన్నారు. ప్రజలంతా జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. టీడీపీ అసహనంతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తోందన్నారు. వైనాట్ 175 లక్ష్యం మేరకు తాము ఎన్నికల్లో గెలిచేందుకు అవకాశముందని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అందరూ తోకముడుస్తారన్నారు. బాబు మళ్లీ అధికారంలోకి వస్తే పెత్తందార్ల రాజ్యమొస్తుందని ప్రజలు ఆలోచించి వైసీపీకి ఓటేశారన్నారు.


