భారత్‌లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు
భారత్‌లో గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులను ప్రకటించింది. ఈ పెట్టుబడి మొత్తం 17.5 బిలియన్ డాలర్లు అని కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ తర్వాత మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దేశం తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లక్ష్యాలను అధిగమించేందుకు మద్దతుగా ఈ పెట్టుబడులకు సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సామర్థ్యాలను నిర్మించడంలో మైక్రోసాఫ్ట్ సహకారం అందిస్తుందని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ఈ మొత్తాన్ని మరో నాలుగేళ్లలో ఉపయోగిస్తామని, ఇది ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు అదనమని ఆయన స్పష్టం చేశారు.

