Breaking Newshome page sliderHome Page SliderNational

వనతారలో మెస్సీకి అరుదైన బహుమతి

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఇటీవల గుజరాత్‌లోని వనతారను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెస్సీకి అనంత్ అంబానీ అరుదైన బహుమతిని అందజేశారు.

రిచర్డ్ మిల్లీ సంస్థకు చెందిన RM 003 V2 లగ్జరీ వాచ్‌ను ఆయన మెస్సీకి బహూకరించారు. ఈ వాచ్ విలువ దాదాపు రూ.10.91 కోట్లుగా అంచనా వేయబడుతోంది. ఇది లిమిటెడ్ ఆసియా ఎడిషన్ కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 వాచ్‌లే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ‘గోట్ టూర్’లో భాగంగా ఈ నెల 13 నుంచి 16 వరకు భారత్‌లో పర్యటించిన మెస్సీ, ఈ సందర్భంగా వనతార సందర్శనను ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు.