పాక్ ప్రధానిపై మీమ్స్ వర్షం..
పాకిస్తాన్ ప్రధానిని నెటిజన్లు మీమ్స్‌తో ఆడేసుకుంటున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకి ఠారెత్తిన పాకిస్తాన్ ప్రపంచం దృష్టిలో మరింత నవ్వులపాలవుతోంది. పాక్ ప్రధాని షెహబాజ్‌పై మీమ్స్ కూడా బాంబుల్లా పేలుతున్నాయి. సరిగ్గా భారత ప్రధాని నరేంద్రమోదీ చేసే పనులనే కాపీ కొడుతున్నారు. మంగళవారం మోదీ పంజాబ్‌లోని ఆదంపుర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించి, సైనికులతో ముచ్చటించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా పాక్ ప్రధాని సియాల్‌కోట్‌లోని ఆర్మీబేస్‌ను సందర్శించారు. అక్కడ పస్పూర్‌లోని కంటోన్మెంట్‌ను సందర్శించి, భారత్ దాడుల్లో ధ్వంసమైన తమ ఆర్మీ స్థావరాన్ని పరిశీలించారు. దీనితో ప్రతీ విషయంలోనూ మోదీని కాపీ కొడుతున్నారంటూ షెహబాజ్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాపీ క్యాట్ అంటూ ఎగతాళి చేస్తున్నారు.

