మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్..పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకే రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో పేరెంట్ టీచర్స్ మెగా మీటింగ్స్ ఏర్పాటు చేసింది. వీటిలో సీఎం సహా మంత్రులు కూడా పాల్గొనడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో ఈ కార్యక్రమం జరగుతోంది. బాపట్ల ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యామంత్రి లోకేష్ హాజరయ్యారు. అనంతరం సీఎం విద్యార్థులతో ముచ్చటించారు. ఇక్కడ 23 ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయగా, చంద్రబాబు, లోకేశ్ కూడా పిల్లలతో కలిసి భోజనం చేయనున్నారు. అలాగే కడపలోని మున్సిపల్ హైస్కూల్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. విద్యార్థులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


 
							 
							