కలెక్టర్‌తో మీటింగ్..ఫోన్లో రమ్మీ ఆడుతూ ఎంజాయ్
అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విచిత్ర ఘటన వెలుగుచూసింది. జిల్లా రెవెన్యూ అధికారి మలోలా కీలకమైన సమావేశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. అధికారులందరూ బిజీగా ఉన్న సమయంలో ఈ డీఆర్వో మలోలా మాత్రం తన సెల్ఫోన్లో కూడా రమ్మీ ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఆయన తీరుపై మండిపడుతున్నారు. ఇలాంటి అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

