శివలింగం వద్ద మాంసం ముద్దలు..!
ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. శివలింగం వద్ద మాంసం ముద్దలు దర్శనమిచ్చాయి. హైదరాబాద్‌లోని టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయంలో శివలింగం వెనుక మాంసం ముద్దలు పడేశారు దుండగులు . మాంసం చూసి కంగుతిని పోలీసులకు భక్తులు సమాచారం ఇచ్చారు . వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయం వద్దకు హిందూ సంఘాలు భారీగా చేరుకుంటున్నారు. మాంసం పడేసింది ఎవరో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు.

