Andhra PradeshHome Page Slider

శ్రీకాకుళంలో భారీ రియాక్టర్ పేలుడు

శ్రీకాకుళం జిల్లాలోని పైడిభీమవరంలో సరకా ల్యాబొరేటరీస్‌ అనే రసాయనిక పరిశ్రమలో  రియాక్టర్ పేలింది. దీనితో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. పరిశ్రమ సమీపంలోని పలు వాహనాలు దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సంఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ఫార్మాస్యూటికల్ ల్యాబరేటరీ. సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.