షేక్‌పేటలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లోని షేక్‌పేట వద్ద డ్యూక్స్ ఆవెన్యూ భవనంలో నేటి ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ భవనంలో ఆకాశ్ సంస్థ ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్ ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ భవనంలో 2,3 అంతస్తులలో మంటలు వ్యాపించాయి. ఈ భవనం అద్దాలతో నిండి ఉండడంతో మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది. ఈ కోచింగ్ సెంటర్‌లో కంప్యూటర్లు, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయాయి. ఈ భవనంలోని సిబ్బందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. ఈ భవనంలోని రిలయన్స్ ట్రెండ్స్ కూడా అగ్నిప్రమాదానికి గురయ్యింది.


 
							 
							