మసాజ్ చేసుకుంటే పక్షవాతం వచ్చింది
హెడ్ మసాజ్ చేయించుకున్న కారణంగా ఒక యువకునికి పక్షవాతం వచ్చిన ఘటన బెంగళూరులో జరిగింది. బళ్లారికి చెందిన ఒక యువకుడు బెంగళూరులో హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఒకరోజు జుట్టు కటింగ్ చేయించుకోవడానికి సెలూన్‌కు వెళ్లాడు. అక్కడ కటింగ్ అయ్యాక ఫ్రీగా హెడ్ మసాజ్ చేస్తామంటే చేయించుకున్నాడు. ఈ క్రమంలో గొంతు తిప్పగా విపరీతమైన నొప్ప కలిగింది. అనంతరం ఇంటికి వెళ్లిపోయాడు. గంట తర్వాత మొత్తం శరీరంలో ఎడమభాగం స్వాధీనం కోల్పోయింది. దీనితో భయపడి ఆసుపత్రికి వెళ్లగా, మెదడుకు రక్త సరఫరా క్షీణించి పక్షవాతం వచ్చిందని వైద్యులు పేర్కొన్నారు. బలవంతంగా మెడ, గొంతు తిప్పడం వల్ల ఇలాంటి సమస్య వచ్చిందన్నారు. దీనితో చికిత్స కోసం అతడికి లక్షల రూపాయల వ్యయం అయ్యింది. తల మసాజ్ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు వైద్యులు. సరైన శిక్షణ లేని వారి వద్ద ఇలాంటి మసాజ్‌లు చేయించుకోరాదని హెచ్చరించారు.

