హైదరాబాద్‌లో సామూహిక గీతాలాపన – ట్రాఫిక్ ఆంక్షలు
75 సంవత్సరాల స్వతంత్ర మహోత్సవాన్ని పునస్కరించుకొని హైదరాబాద్‌లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు ధూంధాం అని జరిగాయి. ప్రతి ఇంటా జెండా రెపరెపలాడింది. స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని..
తెలంగాణ ప్రభుత్వం సామూహిక గీతాలాపనకు పిలుపునిచ్చింది. కాగా ఈరోజు జరిగే స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా సామూహిక గీతాలాపనలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం అబిడ్స్ జీపీవో జంక్షన్‌లో జరగబోతోంది. అందువల్ల నగరంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండబోతున్నాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈరోజు ఉదయం 9.30 నుండి 12.30 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ఇంకా ఈ రోజు ఉదయం 11.30 గంటలకు ట్రాఫిక్‌ను కూడళ్ల వద్ద, సిగ్నల్స్ వద్ద ఆపుచేసి జాతీయగీతాన్ని ఆలపించనున్నారు. మెట్రో రైళ్లను కూడా ఆ సమయానికి నిలిపివేసి జాతీయగీతాలాపన చేయనున్నట్లు కమీషనర్ వెల్లడించారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా ఉన్నాయి.
బషీర్ బాగ్ ఫ్లైఓవర్ మీదుగా బాబు జగజగ్జీవన్ రామ్ కూడలి వైపు లిబర్టీ నుండి వచ్చే వాహనాలను అబిడ్స్ వైపు అనుమతించరు. ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్, ఏఆర్ పెట్రోల్ బంక్ మీదుగా నాంపల్లి వైపుగా మళ్లిస్తారు.
పీసీఆర్ నుంచి జగ్జీవన్ రామ్ కూడలి వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ బంక్ నుంచి నాంపల్లి మార్గంలో మళ్లిస్తారు.
లిబర్టీ నుండి బాబూ జగ్జీవన్ రామ్ కూడలి వైపుగా వచ్చే వాహనాలు హిమయత్ నగర్, నారాయణగూడ మీదుగా కాచికూడ, కోఠి వైపు పంపిస్తారు.
కోఠి నుండి అబిడ్స్ ప్రధాన రహదారి మార్గంలో ఉండే ట్రాఫిక్ కోఠి X ROAD వద్ద హనుమాన్ టేక్డీ , ట్రూప్ బజార్, కోఠి వైపు వెళ్లాల్సి ఉంటుంది.
ఇక MJ మార్కెట్, జాంబాగ్ నుండి అబిడ్స్ వైపు వచ్చే వాహనాలు నాంపల్లి స్టేషన్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
అఫ్జల్ గంజ్, ఎంజే మార్కెట్ నుండి వచ్చేవారు తమ వాహనాలను నాంపల్లి అన్నపూర్ణ హోటల్ రోడ్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో పార్కింగ్ చేసుకోవచ్చు.
లిబర్టీ నుండి ఈ అబిడ్స్ జీపీవోలో జరిగే ప్రోగ్రామ్ కోసం వచ్చేవారు నిజాం కళాశాల మైదానంలో తమ పార్కింగ్ చేసుకోవాలి.
అబిడ్స్ తాజ్‌మహల్ నుండి కింగ్ కోఠి కూడలి, బాటా నుంచి బొగ్గులకుంట కూడలి, GHMC కార్యాలయం, రామకృష్ణ థియేటర్ ప్రాంగణం, గ్రామ్ స్కూల్ వద్ద కూడా వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు.