సామూహిక జాతీయ గీతాలాపన విజయవంతం
తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 11:30 గంటలకు జనగణమణ గీతాన్ని ఆలపించారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్, ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు వద్ద సామూహికంగా జాతీయగీతాన్ని ఆలపించారు. మెట్రో రైళ్లు సహా ఇతర వాహనాలను ఎక్కడిక్కడ నిలిపేసి ఈ కార్యక్రమం నిర్వహించారు.
అబిడ్స్ జీపీఓ సర్కిల్ వద్ద జాతీయ గీతాలాపన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశవరావు, అసదుద్దీన్ ఒవైసీ, మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్ రెడ్డి, తలసారి శ్రీనివాస్ యాదవ్, ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద ఎత్తున యువత పాల్గొని విజయవంతం చేశారు.