Home Page SliderTelangana

బీఆర్‌ఎస్ నేతలపై ఐటీ దాడుల విషయంలో మర్రి జనార్దన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మంగళవారం నుండి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లలో ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. మర్రి జానార్దన్‌రెడ్డి, ఫైళ్ల శేఖర్‌రెడ్డి నివాసాలలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా ఈ దాడులు చేయిస్తోందని మండిపడుతున్నారు బీఆర్‌ఎస్ నేతలు. ఈ సోదాలపై ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు వ్యాపారాలు చేయకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా అని ప్రశ్నించారు. నిన్నటి నుండి సోదాలు చేస్తున్నారని, తన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఐటీ అధికారులకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని, వ్యాపారాలకు సక్రమంగా పన్నులు కడుతున్నానని, ఇప్పటి వరకూ దాదాపు 200 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లించానని తెలియజేశారు. సోదాలు చేస్తున్నఐటీ అధికారులు నిజం తెలుసుకున్నారని, తనకు క్లీన్‌చిట్ ఇచ్చారని పేర్కొన్నారు. బీజేపీ కక్ష పూరితంగా ఈ సోదాలు చేయిస్తోందని విమర్శించారు.