ప్రభుత్వ పాలన తీరుపై మావోయిస్టుల లేఖ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు పట్ల మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు. తెలంగాణలో బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నారని మావోయిస్టులు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోందని, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మాత్రం దూకుడుగా పని చేస్తోందని మావోయిస్టు పార్టీ విమర్శించింది. మావోయిస్టు పార్టీ తన లేఖలో హైడ్రా, మూసీ సుందరీకరణ అంశాలను, ఇటీవల కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జరిగిన కూడా ప్రస్తావించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది.



