హ్యాట్రిక్ మిస్సయ్యిన మను బాకర్
పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన షూటర్ ఛాంపియన్ మను బాకర్ హ్యాట్రిక్ మిస్సయ్యింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో కాస్తలో మూడవ పతకాన్ని చేజార్చుకుంది. నాలుగవ స్థానంలో నిలిచింది. కొరియా షూటర్ యాంగ్ జిన్ స్వర్ణ పతకం సాధించగా, ఫ్రాన్స్‌కు చెందిన షూటర్ కామెలీ రజతం, హంగేరీ క్రీడాకారిణి మేజర్ వెరోనికా కాంస్య పతకం సాధించారు. మను బాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో, సరబ్‌జ్యోత్ సింగ్‌తో కలిపి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే.

