InternationalNewsNews Alert

పాకిస్తాన్‌లో హిందూ మహిళా DSP

Share with

“ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్” అన్నట్లు నేటి మహిళలు అన్ని రంగాలలోనూ ముందంజలో ఉన్నారు. కానీ పాకిస్తాన్ లాంటి మత ఛాందసవాదులున్న దేశంలో అదీ హిందూ స్త్రీ అయిన ఒక అమ్మాయి రక్షణశాఖలో ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధించడం అంత సులువైన విషయం కాదు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన 26 ఏళ్ల అమ్మాయి గురించి తెలుసుకుందామా. పాకిస్తాన్‌లో హిందూ మైనార్టీ వర్గానికి చెందిన మనీషా రుపేతా ఓ ప్రత్యేకత చాటుకుంది. ఆమె సింధ్ ప్రావిన్సు జాకోబాబాద్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. తన చిన్నతనం నుండి అమ్మాయిలకు డాక్టర్ లేదా టీచర్ లాంటి ఉద్యోగాలే మంచిదని, రిస్క్ ఎక్కువగా ఉండే పోలీస్, ఆర్మీలాంటి ఉద్యోగాలలో ఇమడలేరనీ వింటూ వచ్చింది. ఆ ఆలోచనా విధానాలను మార్టాలని అనుకున్న ఆమె ఏలాగైనా పోలీస్ అవ్వాలని అనుకుంది.

మహిళలపై జరిగే వేధింపులు, నేరాలను భరించలేక వారికి ఉపయోగపడేలా ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో ఆమె ఈ ఉద్యోగాన్ని ఎంచుకుంది. దానికోసం చిన్నతనం నుండి కృషి చేసి సింధ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ పరీక్షలలో 16వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం శిక్షణలో ఉంది. పాక్ పోలీస్ శాఖలో డీఎస్పీగా ఎంపికైన తొలి హిందూ మహిళగా నిలిచింది. ఇలా దేశం కాని దేశంలో ఆశను నెరవేర్చుకున్న మనీషా యువతరానికి ఎంతైనా ఆదర్శం కదా.