కామారెడ్డి యువకుడు.. గల్ఫ్ జైల్లో బందీ
కామారెడ్డి జిల్లా క్యాసం పల్లికి చెందిన భూక్యరాజు అదృశ్యమయ్యాడని అతని తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు నెల క్రితం ఉపాధి విషయమై గల్ఫ్ కి వెళ్లినట్టు తెలిపారు. ఉపాధి విషయమై గల్ఫ్ కి వెళ్లేందుకు ఏజెంట్ సహాయం తీసుకున్నారని , ఇప్పుడు ఆ ఏజెంట్ మోసం చేసాడని కన్నీటి పర్యంతం అయ్యారు. తమ కుమారుడి నుండి నెల రోజుల నుండి ఏ సమాచారం రాకపోవడంతో , అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మెరకు పోలీసులు ఏజెంట్‌ని సస్ప్‌క్ట్ గా భావించారు. ఏజెంట్ కోసం గాలింపు చర్యలు చెేప్పట్టారు. అతనిని గుర్తించిన పోలీసులు , కేసు విచారణలో భాగంగా ఏజెంట్‌ని ప్రశ్నించగా , భూక్యరాజు గల్ఫ్ జైల్లో ఉన్నట్టు తెలిపాడు. ఈ విషయం తేలుసుకున్న భూక్యరాజు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. తమ కుమారుడ్ని ఎలాగైన తిరిగి తమ దగ్గరకు తీసుకురమ్మని వాపోయారు.