NationalNewsNews Alert

అందరు మెచ్చిన PARLE..ఇంకా తగ్గని క్రేజ్

Share with

భారత దేశంలో ఎన్నో రకాల బిస్కెట్ కంపేనీలు ఉన్నాయి.ప్రతిరోజు ఆ కంపెని తయారీ దారులు  రకరకాల ఫ్లేవర్స్‌ పేరుతో బిస్కెట్లు తయారు చేయించి మార్కెట్లోకి విడుదల చేస్తూంటారు.సమాచార మాధ్యమాల ద్వారా తమ బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తుంటారు.అయితే మన అందరి చిన్నప్పటి నుంచి ఉన్న,మనకి బాగా తెలిసిన బ్రాండ్ పార్లె.ఇది చాలా కాలం నుంచి ప్రజలకు తెలిసిన బ్రాండ్.ఈ మధ్యకాలంలో ఎన్నో కొత్త రకాల బ్రాండ్‌లు ప్రజలలోకి వచ్చాయి.ఈ నేపథ్యంలో ఏ బ్రాండ్‌ను ప్రజలు బాగా ఆదరిస్తున్నారో..తెలుసుకోవాలని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ కంటార్ ఇండియా ప్రతి సంవత్సరం సర్వేలను నిర్వహిస్తూ వస్తుంది.ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో బిస్కెట్ల తయారీ సంస్థ పార్లె 2021కి భారత్‌లో అత్యంత ఆదరణ కలిగిన బ్రాండ్‌గా నిలిచింది.

కంటార్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ,గతేడాది పార్లె ప్రాడెక్ట్స్ వరుసగా 10 ఏటా ఈ ర్యాంకిగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది.ఈ కంటార్ తాజా నివేదిక ప్రధానంగా కన్స్యూమర్ రీచ్ పాయింట్స్ (సీఆర్‌పీ) ఆధారం చేసుకుని ఈ జాబితాను విడుదల చేసింది.అయితే సీఆర్‌పీ అనేది వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసిన, ఒక సంవత్సరంలో ఎక్కువగా అమ్ముడైన బ్రాండ్ మీద ఆధారపడి ఉంటుంది. సీఆర్‌పీ ప్రకారం మార్కెట్లో ఒక్కో బ్రాండ్‌కు కొన్ని పాయింట్లను రూపొందిస్తారు. సీఆర్‌పీ  అనేది మార్కెట్ ‌లో బ్రాండ్‌కు ఉన్న ఆదరణతో పాటు ఆ బ్రాండ్ విస్తరణ, వినియోగదారుల నుంచి ఆ బ్రాండ్‌కు ఉన్న గిరాకీని సూచిస్తుంది. ప్రస్తుతం పార్లే తరువాత ఈ జాబితాలో అమూల్, బ్రిటానియా, క్లినిక్‌ప్లస్, టాటా ప్రోడక్ట్స్ సంబంధించన బ్రాండ్‌లు ఉన్నాయి.అయినప్పటికీ పార్లే వరుసగా పదోసారి రికార్డు స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది.అయితే గతేడాది కంటే 2021లో ఈ బ్రాండ్ 14% వృద్ది సాధించడం విశేషంగా చెప్పవచ్చు. దీనితో పాటు పాల ఉత్పత్తులను చేసే అమూల్ 9 , బ్రిటానియా 14 శాతం వృద్ది సాధించాయి. ఈ నేపథ్యంలో ప్యాకేజీ ఫుడ్ విభాగంలో హల్దీరామ్ బ్రాండ్ ఈసారి టాప్-25లో 24వ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది బిస్కెట్లు,కేక్ బ్రాండ్ అయిన అన్మోల్ కూడా కంటార్ జాబితాలో అత్యంత ఆదరణ కలిగిన బ్రాండ్ ‌గా చోటు దక్కించుకుంది. కరోనా కారణంగా ఏర్పడిన ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు 2020 కంటే 2021లో ఎక్కువ బ్రాండ్‌లు ర్యాంకింగ్స్ క్లబ్‌లో చేరాయి.