13 మందిని మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకు
రాష్ట్రంలో రోజు రోజుకు నిత్య పెళ్లి కొడుకుల సమస్యలు ఎక్కవవుతోంది. వీటికి సంబందించిన కేసులు ఎక్కడో ఓక చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న నిత్య పెళ్లి కొడుకు శివ శంకర్ బాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రాష్ట్రలలో కలిపి మెత్తం 13 మందిని మోసం చేసి, పెళ్లిళ్లు చేసుకొని వారి వద్ద నుండి డబ్బులు తీసుకొని పారిపోయినట్టు పోలీసుల విచారణలో తెలింది.

హైదరాబాద్ , రాచకొండ , సంగారెడ్డి , గుంటూరు , విజయవాడలలో శివ శంకర్ బాబు పై ఇంతకు ముందే కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు . ఇంతకు ముందే అతన్ని అరెస్ట్ చేసి , కఠినంగా శిక్షించాలని బాధిత మహిళలు రొడ్డెక్కినట్టు స్పష్టం చేశారు. అమెరికాలో నివసిస్తున్న హైదరాబాద్ మహిళను మోసం చేసి ఆమె వద్ద నుండి 35 లక్షలు వసూలు చేసినట్టు తెలిపారు.