బీ అలర్ట్.. బైక్ దొంగతనం చేసి పరార్
ఏపీలోని గుంటూరు మార్కెట్ సెంటర్‌లో బైక్ ను దొంగిలించి పరారయ్యాడు ఓ దొంగ. బైక్ ను దొంగిలించే ముందు పెట్రోల్ బంక్‌లో ఆఫ్ లీటర్ పెట్రోల్ తీసుకున్నాడు. అక్కడ ఉన్న రెండు బైక్‌లను స్టార్ చేయడానికి ప్రయత్నించాడు. అవి స్టార్ట్ కాకపోవడంతో మూడో బైక్‌ను ట్రై చేశాడు. ఆ బైక్ స్టార్ట్ అవడంతో దొంగిలించి పరారయ్యాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బైక్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 
							 
							