మల్లారెడ్డి రాజీనామా చెయ్..!
హైదరాబాద్‌లో క్యాసినో సెంటర్లకు లోకల్ ఏజెంట్లుగా పనిచేస్తున్న ప్రవీణ్, మాధవరెడ్డిపై పక్కా సమాచారం అందడంతోనే సోదాలు జరిపిన ఈడీ అధికారులు ఐఎస్ సదన్‌లో ఉంటున్న చీకోటి ప్రవీణ్, బోయిన్‌పల్లికి చెందిన మాధవరెడ్డి అనే వ్యక్తుల ఇళ్లతో పాటు మొత్తం 8 చోట్ల ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. వీరిద్దరిపై ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసారు. అయితే మాధవరెడ్డి ఇంట్లో సోదా జరిపే క్రమంలో మంత్రి మల్లారెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్న కారును గమనించారు. బోయిన్‌పల్లిలో నివాసం ఉండే మాధవరెడ్డి 6 నెలల క్రితం వరకు ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేసేవాడు. గతంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మాధవరెడ్డి ప్రవీణ్ దందాలో భాగస్వామిగా చేరిన తర్వాత బాగా సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మాధవరెడ్డికి, మల్లారెడ్డికి సంబంధం ఉందా అనే కోణంలో ఈడీ విచారణ చేయాల్సిన నేపథ్యంలో మల్లారెడ్డి తనకు, వారికి ఏ రకమైన సంబంధం లేదని యూటర్న్ తీసుకున్నారు.
మాధవరెడ్డి… ఆ స్టిక్కర్‌ను మూడు నెలల ముందే తీసిపారేసానని… ఎవరో దానిని పెట్టుకుంటే తనకు ఎలా సంబంధం ఉంటుందని ఎదురు ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేల కాలం తీరిపోయిన స్టిక్కర్లను ఎవరెవరో వాడుకుంటున్నారని మంత్రివర్యులు సెలవిచ్చారు. నిజానికి 2021 జూన్‌లో క్యాసినో వ్యవహారంలోనే ఆయన తమ్ముడు కూడా బోయినపల్లిలో ఒకసారి పట్టుబడ్డాడు. మరి ఆయన వద్ద దానికేం సమాధానం ఏం ఉందో. తనకు తెలియకుండానే ప్రభుత్వం ఇచ్చిన కారు స్టిక్కర్లు మాధవరెడ్డి కారుకు ఎలా వచ్చిందన్నది చిదంబర రహస్యం.