హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులలో భారీ మార్పులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే మెట్రో రైలు ప్రాజెక్టులలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. రైలుమార్గాల విస్తరణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎయిర్ పోర్టు మెట్రో ప్రాజెక్టు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు జీవో 111 ప్రకారం మెట్రో ఎలైన్‌మెంట్‌ను రూపొందించడంపై అధికారులను ప్రశ్నించారు. అయితే ఇప్పటికే అక్కడ ఓఆర్‌ఆర్ ఉందని, రాయదుర్గం నుండి శంషాబా విమానాశ్రయం వరకూ నిర్మించవలసిన మెట్రో టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు. ఈ మెట్రో మార్గానికి ప్రత్నామ్నాయంగా ఎంజీబీఎస్ నుండి ఫలక్‌నామా, చాంద్రాయణ గుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్ పల్లి, విమానాశ్రయం మార్గాలను అధ్యయనం చేయాలని సూచించారు. తూర్పు, మధ్య, పాత నగరంలో అధిక జనాభాకు కూడా మెట్రో మార్గం అందుబాటులోకి రావాలన్నారు. ఇంత వరకూ పాతబస్తీ మెట్రో పనులు పూర్తి చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఈ మెట్రో మార్గాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మెదటి దశలోని ఒప్పందం మేరకు పాతబస్తీలోని ఎంజీబీఎస్ నుండి ఫలక్‌నుమా వరకూ 5.5 కిలోమీటర్ల మార్గాన్ని కూడా ఇంత వరకూ పూర్తి కాలేదని, దీనిపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. మూసీ కారిడార్‌లోని నాగోల్ నుండి గండిపేట వరకూ ఎంజీబీఎస్‌ను కలుపుతూ ఈస్ట్, వెస్ట్ రోడ్ కమా మెట్రో రైలును కూడా ప్రాజెక్టులో చేర్చాలని ఆదేశించారు.

