NewsTelangana

హైదరాబాద్‌లో భారీ వర్షం అలర్ట్

Share with

వర్షాలు, వరదలతో ఇప్పటికే తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మూసీ నది ఉప్పొంగడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఐతే ఈ వానల బాధ ఇంకా ఉంది. అయితే ఈ రోజు నగరంలోని పలు చోట్ల వర్షం కురిసింది. మూసారాబాద్, మలక్‌పేట, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, పాతబస్తీలోని బార్కాస్, చాంద్రాయణగుట్ట, బహుదూర్‌పురా, ఫలక్‌నుమా, పలు ప్రాంతాలైనా అత్తాపూర్, గండిపేట,శంషాబాద్, శాంతరాయి సహా మెస్తరు వర్షం పడింది. హైదరాబాద్‌లోని ప్రధాన మార్గాల్లో రోడ్లపైకి వరదనీరు చేరడంతో స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్ళే వారు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. అయితే మరో రెండు గంటల్లో నగరంలో భారీగా వర్షం కురిసే అవకాశమున్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వెదర్ ఎక్స్‌పర్ట్స్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌లో ప్రధాన రహదారుల్లో రోడ్లపైన వరదనీరు చేరి ట్రాఫిక్‌కు అంతారాయం కలిగే అవకాశముందని చెప్పారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తెలిపారు. వర్షం కురిసి అగిన గంట తరువాతే రోడ్లపైకి రావాలనీ సుచించారు. కొన్ని ముఖ్యమైన రోడ్లల్లో వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని తెలిపారు.