NationalNewsNews Alert

SSLV ద్వారా స్కూలు పిల్లలు తయారుచేసిన శాటిలైట్ల ప్రయోగం

Share with

రాకెట్ సైన్సెస్‌లో ఇండియా అగ్రదేశాలతో పోటీ పడుతోంది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా లకు దీటుగా ఎన్నో శాటిలైట్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. PSLV ఉపగ్రహాలను అనేకం భూకక్ష్యలోకి పంపించింది. ఇంకా చంద్రయాన్, మంగళయాన్‌లు కూడా మన రాకెట్‌సైన్స్ విజయంలో మైలురాళ్లుగా నిలిచాయి. తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తయారుచేసిన (SSLV) స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌ను ఈనెల 7న ఉదయం 9.18 గంటలకు ప్రయోగించనుంది.

ఇది పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. దీనిలో స్వదేశీ, విదేశీ సంస్థలతో పాటు, విద్యార్థులు తయారుచేసే చిన్న తరహా ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలో ప్రవేశపెట్టబోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 75 జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థులు తయారు చేసిన ఆజాదీ శాట్ అనే ఉపగ్రహాన్ని ఆ రాకెట్ ద్వారా తొలిసారిగా అంతరిక్షం లోనికి పంపిస్తున్నారు. 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ఈ రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.