ఐస్‌క్రీమ్ వెండర్‌ని ఆటపట్టించిన మహానటి..
సాధారణంగా ఐస్‌క్రీమ్ అమ్మేవాళ్లు దానిని ఇవ్వకుండా కాసేపు ఆటపట్టించే వీడియోలు చూస్తూనే ఉంటాం. కానీ తనని ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్‌నే ఆటపట్టించిన మహానటి కీర్తి సురేష్ వీడియో వైరల్ అవుతోంది. ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తి దానిని ఇవ్వకుండా కీర్తిని కాసేపు తిప్పించాడు. అయితే డబ్బు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇవ్వకుండా వాళ్లను కూడా ఆటపట్టించింది కీర్తి. జస్ట్ ఫర్ ఫన్ అంటూ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇటీవలే వివాహం చేసుకున్న కీర్తి త్వరలోనే రివాల్వర్ రీటా, కన్నివేడి వంటి చిత్రాలతో సందడి చేయబోతోంది.

