NationalNewsNews Alert

అసోంలో మదరసా `బుల్డోజ్‌`

Share with

అసోంలో ఓ అనుమానిత ఉగ్రవాది నిర్వహిస్తున్న మదరసాను అక్కడి ప్రభుత్వం బుల్డోజర్‌తో ధ్వంసం చేసింది. మోరిగావ్‌ జిల్లాలోని మోయిరాబారి గ్రామంలో ముఫ్తీ ముస్తఫా నిర్వహిస్తున్న జమీవుల్‌ హుదా అనే మదరసాను గురువారం ధ్వంసం చేసినట్లు ఎస్పీ అపర్ణ తెలిపారు. ఈ మదరసాలో చదువుతున్న 43 మంది విద్యార్థులను ఇతర స్కూళ్లకు తరలించారు. బంగ్లాదేశ్‌కు చెందిన అన్సరుల్లా బంగ్లా అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ముస్తఫాను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.

Read more: ఉద్దవ్‌కు సుప్రీంకోర్టులో ఊరట..