అమీర్ ఖాన్‌పై కంగనా హాట్ కామెంట్…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ అమీర్ ఖాన్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారానికి ఆమిర్ ఖానే కారణమని కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. అమీర్ హిందూ ఫోబియాతో ‘పీకే’ లో నటించారు. సినీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. అయినప్పటికీ భారత్‌లో అసహనం పెరిగిపోయిందన్నారు. మతం లేదా సిద్ధాంతాలపై సినిమాలు నిర్మించడం ఆపేయండి’’ అని కంగన చెప్పింది. ప్రస్తుతం కంగన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ‘బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా’ సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో ఆమిర్ ఖన్ గతంలోనే స్పందించాడు. ‘‘నాకు భారత్ అంటే ఇష్టం లేదని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, అది అసత్యం. సోషల్ మీడియాలో నా సినిమాను బాయ్‌కాట్ చేయమనడం విచారకరం’’ అని అమీర్ ఖాన్ అన్నారు. అమెరికన్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ (Forrest Gump)కు రీమేక్ గా ‘లాల్ సింగ్ చడ్డా’ రూపొందింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న రీలీజ్ కానుంది.