Andhra PradeshHome Page Slider

అనితక్కా.. ఏందీ నీ తిక్క.. మంత్రిపై మాధవీలత ఫైర్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గణేశ్ మండపాలకు చలాన్ల అంశం ప్రభుత్వానికి ముప్పుతిప్పలు పెడుతోంది. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గణేశ్ మండపాల వద్ద సౌండ్ సిస్టం కోసం రోజుకు రూ. 100, విగ్రహం సైజును బట్టి రూ. 350 నుండి 750 రూపాయల చలాన్లు కట్టాలని హోం మంత్రి వంగలపూడి అనిత ఇటీవలే ప్రకటించింది. ఈ అంశంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత హోం మంత్రి వంగలపూడి అనితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనితక్కా .. ఏందీ నీ తిక్క అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఓ వీడియో తీసి ఆమె ఇన్ స్ట్రాగాం ద్వారా పోస్ట్ చేశారు. ప్రతి వాళ్లకూ హిందూ పండగలపై పడి ఏడవడం తప్ప వేరే పనిలేదా? అందరికీ హిందూ పండగల మీద చిల్లర ఏరుకోవడమే పని అని అన్నారు. అన్ని మతాలు సమానం.. అన్ని పండగలు సమానం.. అందరూ సమానం అయితే.. మరి మా మైక్ సెట్ కి, మా గణేశ మండపాలకి, మా గణేశ్ ఎత్తుకి డబ్బులెందుకో అంటూ మాధవీలత ప్రశ్నించారు. మైక్ పర్మిషన్ కు రూ. 100, విగ్రహాలకు రూ. 350 ఇవ్వాలా? ఇదే రూల్ క్రిస్టియన్లు, ముస్లింలకు పెట్టండి అని ఫైరయ్యారు.