Home Page SliderNational

కరాటే కళ్యాణికి “మా” అసోసియేషన్ నోటీసులు

టాలీవుడ్ నటి కరాటే కళ్యాణికి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు నోటీసులు ఇచ్చారు. కాగా ఆమె NTRపై అనుచిత వ్యాఖ్యలు చేశారని,క్రమశిక్షణ ఉల్లంఘన కింద నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. దీనిపై 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని కరాటే కళ్యాణిని మా అసోసియేషన్  కోరింది. కాగా ఈ నెల 28న ఖమ్మంలో కృష్ణుడి రూపంలో ఉన్న NTR విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే దీనిపై కరాటే కళ్యాణి ఓ న్యూస్ ఛానెల్‌లో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ..కృష్టుడిని అవమానించవద్దని,కృష్ణుడి రూపంలో NTR విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా మారడంతో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు కరాటే కళ్యాణికి నోటీసులు పంపినట్లు సమాచారం.