బంగాళాఖాతంలో అల్పపీడనం..! మళ్లీ భారీ వర్షాలు..!
గత వారం తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాగల రెండు రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్రతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.