NationalNewsNews Alert

ఇది లంచం-మంచం ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ ఆరోపణలు

Share with


కర్నాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రయాంక ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపాయి. రాష్ట్రంలో లంచం-మంచం సర్కార్ కొనసాగుతోందని వ్యాఖ్యానించడంపై బీజేపీ తీవ్రంగా మండి పడుతోంది. కాంగ్రెస్ నేతల చీకటి జీవితాలకు సంబంధించిన అనేక వీడియోలు గతంలో వెలుగు చూశాయని వాటికి ఏం సమాధానం చెబుతారంటూ కమలనాధులు ఎదురుదాడికి దిగారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ప్రియాంక ఖర్గే వెంటనే మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని బిజేపీ డిమాండ్ చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు కర్నాటకలో పొలిటికల్ హీట్ ను పెంచింది.


రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే కుమారుడు .. కర్నాటక మాజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇటీవల కలబుర్గిలో చేసిన వ్యాఖ్యలు మంటలు మండిస్తున్నాయి. బసవరాజ్ బొమ్మై సర్కార్ ను ఉద్దేశించి ఇది లంచం-మంచం ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఉద్యోగం కావాలంటే మగవారు లంచం ఇవ్వాల్సిందే.. ఆడవారైతే మరో రకంగా సహకరించాల్సిందే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరిపాలనలో బొమ్మై పూర్తిగా విఫలమయ్యారంటూ దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలు చేయడానికి తాను సందేహించడం లేదని కూడా అన్నారు. ఇలాంటి అక్రమాలపై నోరు విప్పిన తనపై కక్షసాధింపులకు దిగుతోందని బొమ్మై సర్కార్ పై నిప్పులు చెరిగారు. సీబీఐని అడ్డం పెట్టుకుని అనేక వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. కానీ.. తాను దేనికీ భయపడే రకాన్ని కాదన్నారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపించాలని.. ఇందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కూడా ప్రియాంక్ ఖర్గే డిమండ్ చేశారు.


ప్రియంక్ చేసిన వ్యాఖ్యలపై కమలనాధులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ ఖర్గేను హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్ నేతలు చేసిన అనేక నిర్వాకాలకు ఏం సమాధానం చెబుతావంటూ నిలదీశారు. వారి శృంగార లీలలకు సంబంధించిన అనేక వీడియోలు బయటకు వచ్చాయని.. వీటి సంగతి నీకు తెలియదా అంటూ ఖర్గేను ఎద్దేవా చేశారు. తప్పుగా మాట్లాడినందుకు మహిళలకు ఖర్గే క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ పట్టుబట్టారు. ఈ వ్యవహారం ఇప్పుడు కర్నాటకలో హాట్ టాపిక్ గామారింది.